త్వరలో పట్టాలెక్కనున్న అఖిల్ సినిమా

త్వరలో పట్టాలెక్కనున్న అఖిల్ సినిమా
x
Highlights

ఎలాగైనా హిట్ కొట్టాలి.. ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు సక్సెస్ మార్క్ సాధించలేదు. ఈసారైనా కచ్చితంగా హిట్ పడకపోతే పరువు గంగపాలవడం ఖాయం. అందుకే అక్కినేని...

ఎలాగైనా హిట్ కొట్టాలి.. ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు సక్సెస్ మార్క్ సాధించలేదు. ఈసారైనా కచ్చితంగా హిట్ పడకపోతే పరువు గంగపాలవడం ఖాయం. అందుకే అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ప్రేమకథగా తెరకెక్కనుందని సమాచారం. ప్రేమకథా చిత్రాలను చక్కని సెంటిమెంటుతో కలిపి తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తర్వాతి సినిమా షూటింగ్ మరో రెండువారాల్లో ప్రారంభం కానుంది.

విజయవంతమైన సినిమాల నిర్మాణానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గీతాఆర్ట్స్ 2 నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోబోతొంది. ఇప్పటికే యువత గుండెల్ని మెలిపెడుతున్న రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయం ఇంకా నిర్దారణ కాలేదు. లవ్ స్టోరీతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories