Ajay Devgan role in RRR: RRR లో అజయ్ దేవగన్ పాత్ర ఇదేనట!

Ajay Devgan role in RRR: RRR లో అజయ్ దేవగన్ పాత్ర ఇదేనట!
x
Highlights

Ajay Devgan role in RRR: బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం)..

Ajay Devgan role in RRR: బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది. దీనితో ఇప్పుడు మిగిలిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు రాజమౌళి.. ఈ సినిమాలో చరణ్, తారక్ లతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఇదే అంటూ ఓ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది..

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్‌ కు అజయ్‌ దేవ్‌గన్‌ మెంటర్‌గా వ్యవహరించే పాత్ర లాగా ఉంటుందని, ఆయన పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుందని తెలుస్తోంది.. అల్లూరి, కొమ్రంభీం లకు విలువిద్య నేర్పించే వ్యక్తిగా అజయ్ పాత్రను రాజమౌళి ఎలివెట్ చేయనున్నాడని సమాచారం.. ఈ సినిమా కోసం రామోజీఫిలిం సిటీలో వేసిన 1900 బ్యాక్‌డ్రాప్‌ ఢిల్లీ సెట్స్‌లో రాజమౌళి అజయ్ దేవగన్ పై కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.. ఇక ఆయన భార్యగా సీనియర్ నటి శ్రియ నటిస్తోంది..

ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories