మరిసారి అంటున్న అర్జున్ రెడ్డి జంట ..

మరిసారి అంటున్న అర్జున్ రెడ్డి జంట ..
x
Highlights

హీరో విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన సినిమా అర్జున్ రెడ్డి .. అ సినిమా తర్వాత విజయ్ తన సినిమాలను ఇతర భాషలో కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్...


హీరో విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన సినిమా అర్జున్ రెడ్డి .. అ సినిమా తర్వాత విజయ్ తన సినిమాలను ఇతర భాషలో కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమా డియర్ కామ్రేడ్ . సినిమా షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్దం అవుతుంది . ఈ సినిమా మొత్తం నాలుగు బాషల్లో విడుదల కానుంది ..

అయితే దీని తరవాత విజయ్ తదుపరి చిత్రం తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో నటించనున్నాడు . భారి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది . ఇందులో విజయ్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు . ఇందులో ఓ ముఖ్యపాత్రకి మాళవిక మోహనన్ ని ఎంపిక చేసింది చిత్ర బృందం . మరో హీరోయిన్ కోసం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ని ఖరారు చేసారు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి జోడి అనిపించుకున్న ఈ జంట మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం టాలీవుడ్ లో హట్ టాపిక్ గా మారింది .

Show Full Article
Print Article
Next Story
More Stories