కరోనా నియంత్రణకి ఆదిత్య మ్యూజిక్ భారీ విరాళం

కరోనా నియంత్రణకి ఆదిత్య మ్యూజిక్ భారీ విరాళం
x
Aditya music has donated 31 lakhs to telangana government
Highlights

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే..

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ,రాజకీయ, క్రీడా, వ్యాపార సంస్థల అధినేతలు అండగా నిలుస్తున్నారు. తమ వంతుగా ఆర్ధిక సహాయం చేసి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా నటులు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.

అందులో భాగంగా తమ వంతు బాధ్యతగా ఆర్ధిక స‌హ‌కారం అందించ‌డానికి ఆదిత్య మ్యూజిక్ ముందుకు వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ అధినేతలు అయిన ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ని క‌లిసి క‌రోనా నియంత్రణకి గాను 31 లక్షలు విరాళం అందించారు. ఇందులో కేటీఆర్ తో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ అధినేతల్లో ఒకరైనా ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ.. కరోనా పైన రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అని అన్నారు. ఈ లాక్ డౌన్ కి స‌హ‌క‌రిస్తూ ప్రజ‌లంతా సేఫ్ గా ఇళ్లకే పరిమితం అయి ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు. త్వరలోనే సంపూర్ణంగా కరోనా నివార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories