మోడీ బయోపిక్ లో...ఆదిలాబాద్ మోడీ...?!

మోడీ బయోపిక్ లో...ఆదిలాబాద్ మోడీ...?!
x
Highlights

సమాజం మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సినిమా చూపినంత ప్రభావం మరే మాధ్యమం ప్రజల మీద చూపలేదు. అందుకే చాలా మంది సినిమాని బలమైన ఆయుధంగా వాడుకుంటారు. పొలిటీషియన్స్ కూడా సినిమాని అలాగే చూస్తారు.

సమాజం మీద సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువ. సినిమా చూపినంత ప్రభావం మరే మాధ్యమం ప్రజల మీద చూపలేదు. అందుకే చాలా మంది సినిమాని బలమైన ఆయుధంగా వాడుకుంటారు. పొలిటీషియన్స్ కూడా సినిమాని అలాగే చూస్తారు. అందుకే ఇప్పుడు పొలిటీషియన్స్ బయోపిక్స్ వస్తున్నాయి.

బయోపిక్ లు బాలీవుడ్ నే కాదు, టాలీవుడ్ ని తాకాయి. ప్రముఖుల అటోబయోగ్రఫీలతో కూడిన బయోపిక్ లు అనేకం వస్తున్నాయి. కొందరు దర్శక నిర్మాతలు కూడా లవ్, సస్పెన్స్, క్రైమ్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ల ను వదిలి ఇప్పుడు బయోపిక్ లను తీయడానికి సిద్ధమవుతున్నారు. అలా త్వరలో మోడీ బయోపిక్ కూడా రానున్నది.

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నరేంద్ర మోడీగా అందరికీ సుపరిచితులు. రెండోసారి భారత ప్రధాన మంత్రిగా ఆయన పని చేస్తున్నారు. భారత కీర్తి పతాకని ప్రపంచానికి చాటిన అతి కొద్ది ప్రధానుల్లో మోడీ ప్రముఖులు. అలాగే సంచలనాల కేంద్రం కూడా. ఆయన రాజకీయ జీవితమే కాదు. వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల సమాహారమే. పుల్వామా దాడుల తర్వాత మోడీ ఇండియన్ హీరోగా మారాడు. బాలాకోట్ మీద మెరుపుదాడితో మోడీ దేశ దేశభక్తుల మదిలో పర్మినెంట్ గా నిలిచిపోయాడు. ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత మోడీ, ప్రపంచ హీరో అయ్యాడు. అలాంటి రియల్ హీరో మీద సినిమా తీయాలని ఎవరైనా ఎందుకనుకోరు?

అలా ఓ స్టార్ డైరెక్టర్ మదిలో మోడీ మెరుపు మెరిసింది. మోడీ బయోపిక్ కి రంగం సిద్ధమైంది. అయితే హీరో ఎవరు? మోడీనే హీరోగా పెట్టి సినిమా తీయగల మొనగాడే ఆ డైరెక్టర్. కానీ, మోడీకి అంత తీరిక లేదు. అయితే అచ్చం అచ్చు గుద్దినట్లుగా మోడీలా ఉండో మరో మోడీ కోసం వెతకడం మొదలు పెట్టాడు ఆ డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి నేనున్నానే గట్స్ ఉన్న ఆ డరెక్టర్ ఆర్జీవి. అదేనండి రామ్ గోపాల్ వర్మ. వర్మ గత ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయో పిక్ తీశారు. వంగవీటి, వీరప్పన్, కన్నడలో కిల్లింగ్ వీరప్పన్, బెజవాడ, రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 అలా ఇప్పటి వరకు రకరకాల థీమ్స్ తో 57 సినిమాలు తీశాడు ఆర్జీవి. వర్మ కళ్ళు ఇప్పుడు మోడీ బయోపిక్ మీద పడ్డాయి.

మోడీకి మోడీలా డిటో కాస్త కూడా అటు ఇటుగా మరీ మోడీలా ఉండే ఓ వ్యక్తి దొరికాడా డైరెక్టర్ కి. అతడే అదిలాబాద్ మోడీ. అందరూ ముద్దుగా పిలుచుకునే ఇతడే ఆ ఆదిలాబాద్ మోడీ. ఇతడి పేరు షేక్ యూబ్. అరె అలాగే ఉన్నాడే. మొత్తం మోడీలానే ఉన్నాడే అనుకుంటున్నారు కదూ. నిజమే. పోలికలు, ఆహార్యం, అన్నీ మోడీని తలపిస్తాయి. మీరే కాదు అయూబ్ ని చూసిన ప్రతివాళ్ళు ఇలాగే అనుకుంటారు. అయూబ్ వృత్తి ఆర్టీసి డ్రైవర్. ఇతడిని చూసి మోడీ ఆదిలాబాద్ వచ్చారంటారు. ఆయనతో సెల్ఫీలు, ఫోటోలో దిగుతుంటారు. అందుకే ఆయనకు ఆదిలాబాద్ మోడీ అని పేరు వచ్చింది.

వర్మ దృష్టి ఇప్పుడు మోడీ మీద పడింది. మోడీ రూపం ఆయూబ్ కు వరంలా మారింది. ఆ రూపమే అపురూపమైంది. వర్మను అకర్షించింది. ప్రధాన మంత్రి మోడీ పై తీస్తున్న బయోపిక్ లో ఆయూబ్ ని మోడి పాత్రకు ఎంపిక చేశాడు వర్మ. అయూబ్ కి వర్మ నిన్న ఫోన్ చేశాడు. నేరుగా వర్మే మాట్లడాడు. తన సినిమాలో యాక్ట్ చేయమని అడిగాడు. మిగతా విషయాలు తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పాడు వర్మ ఇప్పటికే రెండు సార్లు అయూబ్ తో మాట్లాడిన వర్మ మేనేజర్, అయూబ్ ఫోటోలను కూడా పంపించమన్నాడు.

రాంగోపాల్ వర్మ సిబ్బందికి పోటోలను, వీడియోలను పంపానని ఆయూబ్ హెచ్ఎంటీవీ తో అన్నాడు. రెండు మూడు రోజులలో టికెట్ పంపిస్తాం. హైదారాబాద్ వచ్చి కలువమని చెప్పారని అయూబ్ అన్నారు. సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. అవకాశం ఇవ్వడంతో అయూబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోడీ అంటే ఇష్టమని మోడీ పాత్రలో నటించడమంటే చాల సంతోషంగా ఉందని అంటున్నాడు అయూబ్.

వర్మ నుండే కాదు. గతంలో తనకు అనుపమ్ ఖేర్ నుండి తనకు ఫోన్లు వచ్చాయని చెప్పాడు అయూబ్. తనకు మోడీ అంటే ఎంతో ఇష్టమని, మోడీలా తానుండటం వరమని, అయితే, మోడీని ప్రత్యక్షంగా కలవాలని ఉందని, మోడీ కలిస్తే ఎదురెదురుగా నిలబడి నాలా నీవు...నీలా నేను అనుకుంటే చాలని అంతకుమించి తాను ఏమీ కోరుకోనని కూడా అంటున్నాడు అయూబ్. ఎన్నికలకు ముందే మోడీపై బయోపిక్ తీశారు. కానీ, దాని రిలీజ్ విదాస్పదమైంది. తాజాగా వర్మ, మోడీ బయోపిక్ తీయాలనుకోవడం చర్చగా మారింది. అయితే అందులో ఆదిలాబాద్ వాసి అయూబ్ మోడీ పాత్రకు పరిశీలనలో ఉండటమే అత్యంత ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories