తమన్నా సింహాద్రిపై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ...

తమన్నా సింహాద్రిపై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ...
x
Highlights

బిగ్ బాస్ 3 లో హేమ మొదటివారం ఎలిమినేషన్ అవ్వడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి .. అయితే ఆమె...

బిగ్ బాస్ 3 లో హేమ మొదటివారం ఎలిమినేషన్ అవ్వడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి .. అయితే ఆమె వచ్చాక బిగ్ బాస్ హౌస్ కొంచం వేడెక్కిందనే చెప్పాలి . షో చూస్తున్న ప్రేక్షకులు కొందరు ఆమెను సప్పోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు . మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో రవికృష్ణపై తమన్నా చేసిన కామెంట్స్ గురించి మనకు తెలిసిందే .. అయితే తాజాగా తమన్నా సింహాద్రిని కామెంట్స్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి .

'తమన్నా చింపాజాద్రి' అని అంటూ ''గతంలో కొందరు తమన్నా చింపాంజాద్రిని ఇష్టపడ్డారు... బిగ్ బాస్ ఇంట్లో ఆమెను చూసిన తర్వాత ఇపుడు ఎలా ఫీలవుతున్నారో?'' అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి .. గతంలో శ్రీరెడ్డి కి మరియు తమన్నా సింహాద్రి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి . క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ఉద్యమాన్ని నడిపినప్పుడు తమన్నా సింహాద్రి సపోర్ట్ కూడా చేసింది . కానీ ఆమె డబ్బులకు అమ్ముడుపోయి ఆరోపణలు చేస్తుందని తమన్నా సింహాద్రి తనని వ్యతిరేకించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories