పండంటి పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

పండంటి పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ
x
Highlights

విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నటి స్నేహ.. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక తెలుగు...

విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నటి స్నేహ.. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక తెలుగు ప్రేక్షకులకి మాత్రం గోపీచంద్ హీరోగా నటించిన తొలివలపు సినిమాతో పరిచయం అయింది. ఇక ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి.

ఇక తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండు అనే షూటింగ్‌ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దలను ఒప్పించి వీరు 2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. ఈ నేపధ్యంలో మరోసారి తల్లి అయింది స్నేహ. ఈ రోజు (శుక్రవారం) రోజున ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. జాతీయ బాలికల దినోత్సవం రోజున స్నేహా అమ్మాయికి జన్మనివ్వడం యాదృశ్చికమని అభిమానులు అంటున్నారు.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ చెప్పిన స్నేహ మళ్ళీ తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ సినిమాలో నటించింది. ఇక తాజాగా ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.. త్వరలో స్నేహ తమిళ్, తెలుగులో మరిన్ని సినిమాలను చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories