నిర్మాతగా మారనున్న సమంత?

నిర్మాతగా మారనున్న సమంత?
x
Samantha file photo
Highlights

ఎం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమంత.. చేసిన మొదటి సినిమాతో ఇటు అందం, అటు అభినయంతో ఆకట్టుకుంది.

ఏమాయ చేసావే.. సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమంత.. చేసిన మొదటి సినిమాతో ఇటు అందం, అటు అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా హిట్టు కావడంతో సమంత రేంజ్ పెరిగిపోయింది. దీనితో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది సమంత . ఆ తర్వాత అక్కినేని మూడోతరం కథానాయకుడు నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సమంత, కథకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగానే మజిలి, ఓ బేబీ, యుటర్న్ లాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించి విజయాన్ని సాధించాయి. కథల ఎంపికలో మంచి అభిరుచిని కనబరుస్తున్న సమంత నిర్మాణ రంగం వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన స్నేహితుడు రాహుల్ తీసిన చి.ల.సౌ సినిమాని చూసి బాగుండడంతో ఆ కథను అక్కినేని బ్యానర్ నుండి విడుదల చేయలని మామ నాగ్ ని కోరింది.

ఆ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మంచి కథలను వింటున్న సమంత నచ్చితే నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. సమంత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories