మాజీ ప్రియుడు పై సమంత సంచలన వాఖ్యలు

మాజీ ప్రియుడు పై సమంత సంచలన వాఖ్యలు
x
Samantha (File Photo)
Highlights

తన మాజీ ప్రియుడు, హీరో సిద్ధార్థ్ పై అక్కినేని సమంత సంచలన వాఖ్యలు చేసింది.

తన మాజీ ప్రియుడు, హీరో సిద్ధార్థ్ పై అక్కినేని సమంత సంచలన వాఖ్యలు చేసింది. మహానటి సావిత్రి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయో అలాగే తన జీవితంలో కూడా చోటు చేసుకున్నాయని సమంత పేర్కొంది. అయితే తాను ముందుగానే నేను పసిగట్టడంతో జాగ్రత్తపడ్డాను కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్`గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ వాఖ్యలు చేసింది.

ఇక ఆ తర్వాత చైతన్య లాంటి మంచి భర్తకు భార్యను కాగలిగానని సమంత వెల్లడించింది. ఇక గతంలో సమంత సిద్ధార్థ్ ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎదో కారణలతో ఈ జంట బ్రేకప్ తో విడిపోయింది. ఇక సమంత అక్కినేని నాగచైతన్య ఏడేళ్ళుగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్ గా వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక గత ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేనప్పటికీ తమిళ్ లో విజయ్ సేతిపతి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories