పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఫిదా భామ!

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఫిదా భామ!
x
Actress Sai pallavi(File photo)
Highlights

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో తనకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక డాన్స్ లో కూడా ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇది ఇలా ఉంటే గతకొద్ది రోజులుగా సాయి పల్లవి ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపైన తాజాగా సాయి పల్లవి స్పందించింది. త్వరలో నేను పెళ్లి చేసుకుంటున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌ పైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకండా అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరమవడం నాకు ఇష్టం ఉండదనీ, మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాననీ సాయి పల్లవి వెల్లడించింది.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. ఇక ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటుగా దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories