ఆటో డ్రైవర్లకి నటి ప్రణీత సహాయం!

ఆటో డ్రైవర్లకి నటి ప్రణీత సహాయం!
x
Actress Pranitha(File photo)
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి పలుదేశాలు లాక్ డౌన్ ని ప్రకటించాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి పలుదేశాలు లాక్ డౌన్ ని ప్రకటించాయి.. ఈ నేపథ్యంలో పనిలేక ఆకలితో చాలా మంది అలాంటిస్తున్నారు. అలాంటివారిని ఆదుకోవడానికి పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. అందులో భాగంగానే నటి ప్రణీత సుభాష్ కూడా వీధుల్లో కలియ తిరుగుతూ ఆహార పొట్లాలను పంచిపెడుతూ ఆకలితో పోరాడే వారిని ఆదుకుంటున్నారు.

ఇక తాజాగా లాక్ డౌన్ ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.. దీనితో ఆటోలు బయట తిరుగుతున్నాయి. వారి సెఫ్టీ గురించి ఆలోచించిన ప్రణీత శానిటైజర్లు, ట్రాన్సపరెంట్ షీల్డులు వారికి అందజేస్తూ సహకారం అందిస్తున్నారు. టీంతో కలిసి ఆమె చేస్తున్న పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. తానే స్వయంగా కొన్ని వాహనాలకు షీల్డులు ఏర్పాటు చేస్తుంది.

ఇక గతంలో ప్రణీత తానే స్వయంగా వంట చేసి ఆకలితో అలాంటిస్తున్న వారికి ప్యాకెట్ల రూపంలో భోజనాలను పంచిపెట్టింది.అంతేకాకుండా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకప్, హెయిర్ స్టైల్ అసోసియేషన్ కు కూడా విరాళాలు ఇచ్చింది. ఇక టాలీవుడ్ లో షూటింగ్ లు ఆగిపోయి ఉపాధి కోల్పోయి సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛారిటీకి మొదటగా విరాళం అందించి మిగతా హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచింది.

ఇక ప్రణీత సినిమాల విషయానికి వచ్చేసరికి టాలీవుడ్లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బావ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరవాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకి ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది.










Show Full Article
Print Article
More On
Next Story
More Stories