తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్‌

తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్‌
x
Highlights

ప్రముఖ మలయాళ హీరోయిన్ అర్చన కవి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. కొచ్చిలో ఆమె ఓ కారులో విమానాశ్రయానికి ప్రయాణిస్తుండగా మెట్రో శ్లాబ్...

ప్రముఖ మలయాళ హీరోయిన్ అర్చన కవి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. కొచ్చిలో ఆమె ఓ కారులో విమానాశ్రయానికి ప్రయాణిస్తుండగా మెట్రో శ్లాబ్ విరిగిపడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అర్చనకు కానీ, డ్రైవర్ కు కానీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు అద్దం దెబ్బతింది. ఈ ప్రమాదం గురించి అర్చన ట్విట్టర్ లో పేర్కొంది. కారు డ్రైవర్‌కు నష్ట పరిహారం అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మేము కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నప్పుడు కాంక్రీట్‌ శ్లాబ్‌ మా కారుపై పడింది. కొద్దిపాటిలో మేము ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. కారు దెబ్బతినందుకు గాను డ్రైవర్‌కు నష్ట​ పరిహారం అందజేయాల్సిందిగా కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ ఘటనపై విచారణ జరపడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల'ని అర్చన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories