బాహుబలి ఆడింది.. సైరా ఆడలేదు.. ఎందుకంటే?

బాహుబలి ఆడింది.. సైరా ఆడలేదు.. ఎందుకంటే?
x
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి
Highlights

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో ముందుకు వెళ్ళింది.

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో ముందుకు వెళ్ళింది. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి 40 కోట్ల నష్టం వచ్చినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికంటే ముందు ఫ్యాన్ ఇండియా మూవీగా బాహుబలి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా అయితే ప్రపంచాన్ని ఏలింది బాహుబలి. అయితే బహుబలి ఆడడానికి, సైరా అడకపోవడానికి గల కారణాల గురించి కన్నడ హీరో సుదీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సైరా సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాకి కల్చరల్ సమస్య ఉంది.. సౌత్ కి సంబంధించిన బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బయోపిక్ లో ఉన్నది ఉన్నట్టు మాత్రమే తీయగలం. కానీ కొత్తగా అయితే ఏమి జోడించలేము. కానీ బాహుబలి అలా కాదు. ఓ ఫిక్షన్ కథ. దాన్ని ఎలా అంటే అలా వాడుకోవచ్చు. అందుకే దీన్నో వాల్ట్ డిస్నీ సినిమాలా ప్రపంచం మొత్తం ఆదరించిందని చెప్పుకొచ్చాడు. సైరా సినిమా చేస్తున్న సమయంలో నేనొక విషయాన్నీ గ్రహించానని, ప్యాన్ ఇండియా సినిమా చేస్తే కల్పిత పాత్రలు గల కథలను మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడు ఎలాంటి కల్చరల్ సమస్యలు రావని చెప్పుకొచ్చాడు. సైరాలో సుదీప్ అవుకు రాజు అనే పాత్రను పోషించాడు.

అంతేకాకుండా రాజమౌళి పైన ప్రశంసలు కురిపించాడు సుదీప్.. రాజమౌళి చాలా తెలివైన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఎలాంటి సినిమాలు చేస్తే మార్కెట్ ఉంటుందో తెలుసుకొని, ఆ సూత్రాన్నే ఫాలో అయి, బాహుబలి సినిమాని తీశాడని చెప్పుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ విలన్ గా నటించాడు. ఈ సినిమా కన్నడ భాషలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సుదీప్ కన్నడ సినిమాలతో పాటు హిందీ దబాంగ్ 3 లో విలన్ గా నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక రాజమౌళి విషయానికి వచ్చేసరికి బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో కలిసి ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి( ఆర్. ఆర్.ఆర్) అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories