అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు : నటి షకీలా

అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు : నటి షకీలా
x
Highlights

శృంగార తారగా దక్షిణాన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది నటి షకీలా.. ఒకప్పటి లాగా ఆమె ఇప్పుడు సినిమాలు చేయడం లేదు కాని ఇప్పటికి ఆమె పాటలు, సినిమాలు...

శృంగార తారగా దక్షిణాన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది నటి షకీలా.. ఒకప్పటి లాగా ఆమె ఇప్పుడు సినిమాలు చేయడం లేదు కాని ఇప్పటికి ఆమె పాటలు, సినిమాలు ఫేమస్ అనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొదటి కుటుంబ కథా చిత్రం'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకి అల్లు అర్జున్ ఎవరో తెలియదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా కొందరు హీరోల పేర్లను ఒక్క మాటలో చెప్పాలని సదరు యాంకర్ కోరారు. అందులో భాగంగా మహేష్ బాబుతనకి సోదరుడు లాంటి వాడని, అయన భార్య నమ్రతతో కూడా మంచి రిలేషన్ ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ అని చెప్పుకొచ్చింది. మోహన్‌లాల్ అయితే దేవుడని, చాలా గొప్ప మనిషి అని చెప్పుకొచ్చింది. ఇక అల్లు అర్జున్ గురించి అడగగా ఆయన ఎవరో తనకు తెలియదని షకీలా సమాధానం ఇచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అల్లు అర్జున్ గురించి తెలియకపోవడం వల్లనే షకీలా అలా అన్నారని, నిజాయతిగా ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక అల్లు అర్జున్‌కు మలయాళంలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఎలా ఉందొ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. ఆర్యతో అక్కడి అభిమానులను పలకరించిన అల్లు అర్జున్ అక్కడ తన సినిమాలను విడుదల చేసి అక్కడ అభిమానులను సంపాదించుకొని మల్లు అర్జున్ గా పేరు సంపాదించుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories