మెగా మేనల్లుడుతో సమరానికి సిద్దమైన శివగామి?

మెగా మేనల్లుడుతో సమరానికి సిద్దమైన శివగామి?
x
Ramyakrishna(File Photo)
Highlights

అందం, అభినయంతో ఆకట్టుగోల నటి రమ్యకృష్ణ... కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పాత్రలకి సైతం ఆమెది పెట్టింది పేరు..

అందం, అభినయంతో ఆకట్టుగోల నటి రమ్యకృష్ణ... కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పాత్రలకి సైతం ఆమెది పెట్టింది పేరు.. పెళ్లి అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ ఆమెకి తగినంత గుర్తింపు అయితే రాలేదు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఆమెకి మళ్ళీ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు మళ్ళీ ఆ స్థాయిలో లేవని చెప్పాలి. ఇప్పుడు ఆమె కోసం మేకర్స్ మళ్ళీ అలాంటి పాత్రని సిద్దం చేశారని తెలుస్తోంది.

తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే.. పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అమెది కీలకపాత్ర అయినప్పటికీ రమ్యకృష్ణ పాత్ర ద్వారానే విలనిజం చూపించానున్నారని సమాచారం..

ఇందులో సాయి తేజ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సాయి ధరమ్ తేజ్ కి 14 వ సినిమా కావడం విశేషం.. ఇక రెబల్, గౌతమ్ నంద సినిమాలను తెరకెక్కించిన నిర్మాతలు జె.భగవాన్ మరియు పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ప్రస్థానం లాంటి పవర్ ఫుల్ సినిమాని చేసిన దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ సినిమా చేస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories