Top
logo

డబ్బులు తీసుకోండి... కానీ రోడ్లు బాగుచేయండి...

డబ్బులు తీసుకోండి... కానీ రోడ్లు బాగుచేయండి...
X
Highlights

అ డబ్బంతా రోడ్లు బాగు చేయడనికి వాడుతామని మాట ఇవ్వండి . ముందు మాట ఇచ్చి అ తరవాత చలానలు రాయండి

నూతన్ నాయుడు తెలుగు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ గా మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి .. అయన మంచి సామాజీక కార్యకర్త కూడా... సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై అయన ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు . అందులో భాగంగానే తాజాగా ట్రాఫిక్ రూల్స్ పై మరియు చలానలపై అయన స్పందించారు ..

ట్రాఫిక్ రూల్స్ పై ఇలా ....

"హెల్మెట్ లేకపోతే రెండు వేలు కాదు నాలుగు వేలు తీసుకోండి . డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పది వేలు కాదు పాతిక వేలు తీసుకోండి . రాంగ్ రూట్ లో వెళ్తే మా పర్సు మొత్తం ఖాళీ చేయండి . ఎం పర్వాలేదు ... తప్పులకి శిక్షలు ఉండాల్సిందే . కానీ అ డబ్బంతా రోడ్లు బాగు చేయడనికి వాడుతామని మాట ఇవ్వండి . ముందు మాట ఇచ్చి అ తరవాత చలానలు రాయండి "అంటూ తనదైన శైలిలో స్పందించారు నూతన్ నాయుడు ..


సినిమాల్లో నూతన్ నాయుడు ...

ఓ సామజీక కార్యకర్తగా పలు సామజీక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సినిమాల్లో కూడా నటించేందుకు నూతన్ నాయుడు ఆసక్తి చూపిస్తున్నారు . గతంలో అయన f2 సినిమాలో నటించి మెప్పించారు . మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు అనే సినిమాలో కూడా అయన నటిస్తునట్లు సమాచారం...

Next Story