Top
logo

మహేష్ పని గోవిందా అనుకున్నారు !

మహేష్ పని గోవిందా అనుకున్నారు !
Highlights

బాలనటుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో మహేష్ బాబు.. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు. కానీ మహేష్

బాలనటుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో మహేష్ బాబు.. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు. కానీ మహేష్ కి బ్లాక్ బస్టర్ హిట్టు అని చెప్పుకోడానికి ఓ సినిమా లేదు. ఈ క్రమంలో విభిన్నమైన చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'ఒక్కడు' సినిమా వచ్చింది. ఈ సినిమా జనవరి 15, 2003న సంక్రాంతి పండుగ సినిమాగా విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మహేష్ కి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా ఒక్కడు నిలిచింది.

ముందుగా హైదరాబాదు లోని చార్మినార్ నేపథ్యంగా, పాతనగరంలో అనే సినిమాని తీయాలని అనుకున్నాడు దర్శకుడు గుణశేఖర్ . దాంతో చార్మినార్ చుట్టుపక్కల గల్లీల్లోని కుర్రాళ్ళు, వాళ్ళలో గ్రూపులు, గ్యాంగుల గొడవలు నేపథ్యంగా ఓ లైన్ అనుకుని డెవలప్ చేసుకుంటూ వెళ్లారు. 1998లో గుణశేఖర్ తన చూడాలని వుంది సినిమా రీరికార్డింగ్ చేయించే సమయంలో మహేష్ బాబు హీరోగా తన తొలిచిత్రం రాజకుమారుడులో నటిస్తున్నారు. ఆ సమయంలో రెండు సినిమాలకు నిర్మాత అయిన అశ్వనీదత్ ఆఫీసులో ఇద్దరూ కలిసినప్పుడు గుణశేఖర్ మహేష్ బాబుకి ఈ కథ లైన్ చెప్పారు. ఈ లైన్ నచ్చడంతో మహేష్ గుణశేఖర్ ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా చేస్తానని చెప్పారు.

ఇక 2001లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన మృగరాజు సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఆ సినిమా తర్వాత చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో అనుకున్న సినిమానే తియ్యాలని గుణశేఖర్ అనుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెస్ రాజుకి కథ చెప్పడం, ఆయనకి నచ్చడం జరిగింది. కథ మొత్తం చార్మీనార్ చూట్టూ ఉండడంతో హైదరాబాదు శివార్లలో చార్మీనార్ సెట్ ని వేశారు. దీనికి మూడు నెలల సమయంలో 300 మంది పనివాళ్ళు కృషిచేసి నిర్మించారు. ఈ నిర్మాణానికి రూ.కోటి డెబ్భై లక్షలు ఖర్చయింది..

సినిమాకు కథాపరంగా అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ని అనుకున్నాడు గుణశేఖర్ కానీ అప్పటికే ఆ టైటిల్ ని ఎవరో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకోవడంతో కబడ్డీ అన్న టైటిల్ పెడదామని భావించారు.ఇక చివరకు ఒక్కడు అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. అప్పటికే మృగరాజు లాంటి ప్లాప్ తీసిన దర్శకుడు, బాబీ లాంటి ప్లాప్ తో ఉన్న మహేష్, దేవీపుత్రుడు లాంటి ప్లాప్ తో ఉన్న ఎమ్మెస్ రాజు కలిసి సినిమా చేస్తుండడంతో అందరు మహేష్ పని గోవిందా అనుకున్నారు కానీ కథను నమ్ముకొని సినిమాని చేశారు.

2003 సంక్రాంతికి ఎన్టీఆర్ నాగ, రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు, శ్రీకాంత్ , వేణు కలిసి నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమాలకి పోటిగా మహేష్ ఒక్కడు సినిమా విడుదలైంది. ఆ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ గా ఒక్కడు నిలిచింది.ఇది మహేష్ కి ఎదో సినిమా .. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించాడు.

Web TitleAbout mahesh babu okkadu movie

లైవ్ టీవి


Share it
Top