అ ఒక్క సీన్ చాలు హరికృష్ణ ఎంత దైర్యవతుండో చెప్పేందుకు ....

అ ఒక్క సీన్ చాలు హరికృష్ణ ఎంత దైర్యవతుండో చెప్పేందుకు ....
x
Highlights

అలా మూడు సార్లు ప్రయత్నించగా కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్లిందట . అప్పుడు వెంటనే హరికృష్ణ కారు నుండి దిగి తన ప్రత్యర్దులను ఉద్దేశిస్తూ..

తెలుగు చలన చిత్రంలో నందమూరి వంశానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అ వంశం నుండి వచ్చిన ప్రతి హీరో కూడా తమను తామెంటో నిరోపించుకున్నవారే . అందులో నందమూరి హరికృష్ణ ఒకరు. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన హరికృష్ణ ఆయన తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సుమారు 25 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మళ్ళీ మొఖానికి మేకప్ వేసుకున్నారు .

నిజానికి ఈ పాత్రను పోషించేందుకు అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అది ఓ నక్సలైట్ కి సంబంధించిన పాత్ర కాబట్టి . కానీ పరిటాల రవి వచ్చి ఆ పాత్రను మీరే చేయలని అనడంతో అ పాత్ర చేసేందుకు ముందుకు వచ్చారు హరికృష్ణ. శ్రీరాములయ్యని ఉత్తేజ పరిచే పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు హరికృష్ణ . అ తర్వాత సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించారు. ఆయన నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.

అయితే ఈ సినిమాలో భాగంగా ఓ అద్బుతమైన సన్నివేశానికి రూపకల్పన చేసారు దర్శకుడు వైవీఎస్ చౌదరి . హరికృష్ణ మరియు అయన ప్రత్యర్ధి అయిన జయప్రకాష్ రెడ్డి కారులో ఒకరికి ఒకరు రైల్వే పట్టాలపై ఎదురుపడుతారు. ఇందులో ఎవరు తగ్గరు. ఈ సమయంలో అక్కడి నుండి ట్రైన్ వస్తుండడంతో చేసేది ఏమిలేకా జయప్రకాష్ రెడ్డి కారును వెనుకకి మళ్ళీస్తారు . అప్పుడు హరికృష్ణ వాహనం ముందుకు వస్తుంది . అయితే సినిమా షూటింగ్ లో భాగంగా హరికృష్ణ కారు స్టార్ట్ కాలేదట .

అలా మూడు సార్లు ప్రయత్నించగా కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్లిందట . అప్పుడు వెంటనే హరికృష్ణ కారు నుండి దిగి తన ప్రత్యర్దులను ఉద్దేశిస్తూ " మొగాడన్నకా తెగింపు ఉండాలిరా ... చావును చూసి మనం భయపడకూడదు .. చావే మనల్ని చూసి భయపడాలని డైలాగ్ చెప్తాడు" . దీనితో సినిమా యూనిట్ మొత్తం చప్పట్లతో అయనని అభినందించారంట... ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి హరికృష్ణ డేరింగ్ చూసి షాక్ కి గురయ్యరంట.. రియల్ లైఫ్ లో హరికృష్ణ ఎంత దైర్యవంతుడో చెప్పడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు ....


Show Full Article
Print Article
More On
Next Story
More Stories