Top
logo

కత్రినా.. నన్ను పెళ్లి చేసుకో ...నువ్వు లేకుంటే చచ్చిపోతా..!

కత్రినా.. నన్ను పెళ్లి చేసుకో ...నువ్వు లేకుంటే చచ్చిపోతా..!
Highlights

సినీ తారలను అభిమానులు ఎంతగానో ప్రేమిస్తుంటారు . వారే తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు .. అయితే బాలీవుడ్ నటి...


సినీ తారలను అభిమానులు ఎంతగానో ప్రేమిస్తుంటారు . వారే తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు .. అయితే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పై ఓ అభిమాని మనసు పారేసుకున్నాడు .. "నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్‌ ఇవ్వుఅంటూ ట్వీట్ చేసాడు" .. ఓ వెబ్‌ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు కూడా ఉన్నారా అని ఆమె ఆనందం వ్యక్తం చేసారు ..

ఆర్బాజ్‌ ఖాన్‌ నిర్వహించే వెబ్‌ షో 'పించ్‌'లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెపై సోషల్‌ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా కత్రినా ఉద్వేగానికి లోనయ్యారు. ఇదే షో లో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా వైవాహిక వ్యవస్థపై మరియు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఎదో ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను అని బదులు ఇచ్చింది ..రణ్‌బీర్‌ కపూర్‌తో లవ్ బ్రేక్ అప్ అయిన తరవాత ప్రస్తుతం ఆమె సింగల్ గానే ఉంటుంది ..

Next Story