ఫ్యాన్స్ నుండి ముప్పై లక్షలు కొట్టేసిన బన్ని ఫ్యాన్ ...

ఫ్యాన్స్ నుండి ముప్పై లక్షలు కొట్టేసిన బన్ని ఫ్యాన్ ...
x
Highlights

సోషల్ మీడియా మన అభిప్రాయాలను ఈజీగా వ్యక్తం చేసేందుకు సులవైన టెక్నాలజీ. సరిగ్గా వాడుకుంటే దీనికి మించింది మరొకటి లేదు. కానీ తేడా వస్తే దినంతా డేంజర్...

సోషల్ మీడియా మన అభిప్రాయాలను ఈజీగా వ్యక్తం చేసేందుకు సులవైన టెక్నాలజీ. సరిగ్గా వాడుకుంటే దీనికి మించింది మరొకటి లేదు. కానీ తేడా వస్తే దినంతా డేంజర్ కూడా మరొకటి లేదు.. అందుకు ఉదాహరణకు ఈ సంఘటన నిదర్శనం.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని ఒకరు ఫ్యాన్స్ ని నమ్మించి ఏకంగా ముప్పై లక్షల వరకు బురిడి కొట్టించాడని సమాచారం..

సోషల్ మీడియా వేదికగా బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని తనకి యాక్సిడెంట్ అయిందని తనకి సహాయం చేయాలనీ కోరాడు. అతని కోరిక మేరకు అల్లు అర్జున్ ఫాన్స్ చాలా మంది కలిసి అతని అకౌంట్స్ లోకి డబ్బులు పంపించారు. దాదాపుగా అందరు కలిసి ముప్పై లక్షల వరకు పంపించినట్టు తెలుస్తుంది. అయితే అతని ఆరోగ్యం గురించి ఎలా ఉందొ తెలుసుకుందామని ట్రై చేయగా అసలు బన్ని విజయ్ అనే వ్యక్తే లేడని అదో ఫేక్ ఎకౌంటు అని, కేవలం డబ్బులకోసం మాత్రమే అతను ఇలా పోస్ట్ పెట్టాడని తెలుసుకున్నారు. బన్ని విజయ్ ఇలా చేయడంతో నిజంగా సహాయం కోరే వారిని కూడా నమ్మలేకపోతున్నాం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories