Coronavirus: షేక్ హ్యాండ్ ఇవ్వబోతే వెనక్కి తీసుకున్నాడు

Coronavirus: షేక్ హ్యాండ్ ఇవ్వబోతే వెనక్కి తీసుకున్నాడు
x
Aaron finch and kane williamson
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడుతుంది. ఇక క్రీడా రంగంపైన దిని ప్రభావం ఎక్కువగానే ఉంది.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడుతుంది. ఇక క్రీడా రంగంపైన దిని ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ వైరస్ ప్రభావంతో జరవాల్సిన పలు సిరీస్‌లు రద్దు అయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టాస్ వేసే సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తోంది.

అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఆసీస్ ఆరోన్‌ ఫించ్‌, కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు. ఈ క్రమంలో విలియమ్సన్ తన చేతిని వెనుకకి తీసుకున్నాడు. ఇది గమనించిన ఇద్దరు కెప్టెన్లు కాసేపు నవ్వుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ర్టేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఆ తర్వాత మోచేతులతో ట్యాప్‌ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌ ఏంచుకొంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కి ఆసీస్ బౌలర్ కేన్‌ రిచర్డ్‌సన్‌కు కరోనా సోకిందని అనుమానం రావడంతో మ్యాచ్‌ నుంచి తొలగించారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సుమారు 125 దేశాలకు ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 4వేల 756 మంది మృతి చెందినట్లు సమాచారం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories