90.ఎం.ఎల్ ఫస్ట్ డే కలెక్షన్స్

90.ఎం.ఎల్ ఫస్ట్ డే కలెక్షన్స్
x
90 ML
Highlights

ఆర్.ఎక్స్.100 సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో కార్తికేయ.. మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టిన కార్తికేయ ఆ తరవాత గుణ 369 సినిమాలో నటించి...

ఆర్.ఎక్స్.100 సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో కార్తికేయ.. మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టిన కార్తికేయ ఆ తరవాత గుణ 369 సినిమాలో నటించి నటుడుగా మంచి మార్కులు వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత 90.ఎం.ఎల్ సినిమాతో డిసెంబర్ 6న(నిన్న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మరికొండ నిర్మించగా, శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకి 3.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు 0.71 లక్షల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.80 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి మొదటి షో నుంచి అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడతో మిగతా షోస్ డల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎలాగు వీకెండ్ కాబట్టి సినిమా ఎంత వరకు కలెక్షన్లను రాబడుతుందో చూడలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories