సాహో 8 నిమిషాల ఛేజింగ్ ఖరీదు 70 కోట్లు?

సాహో 8 నిమిషాల ఛేజింగ్ ఖరీదు 70 కోట్లు?
x
Highlights

సాహో 8 నిమిషాల ఛేజింగ్ ఖరీదు 70 లక్షలు? భారీ బడ్జెట్ తో.. ప్రపంచ స్థాయి చిత్రంగా తెరకెక్కుతోంది సాహో. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న...

సాహో 8 నిమిషాల ఛేజింగ్ ఖరీదు 70 లక్షలు?

భారీ బడ్జెట్ తో.. ప్రపంచ స్థాయి చిత్రంగా తెరకెక్కుతోంది సాహో. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలోనే సంచలనాలు నమోదు చేస్తోంది. ఖర్చు విషయంలో గత రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇటీవలే భారీ ఖర్చుతో ఇంట్రడక్షన్ సీన్ చేశారని వచ్చిన వార్తలు మరిచిపోకముందే.. మరో ఖరీదైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో కీలకమైన ఓ చేజ్‌ సీన్‌ను అబుదాబిలో భారీ ఎ‍త్తున చిత్రీకరించారు. దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ డిజైన్‌ చేసిన ఈ ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో అంచనాలు సినిమా మీద ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి వార్తతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. బాలీవుడ్ నటులు ఇవ్లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్ ముఖేష్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు మహేష్ మంజ్రేకర్‌, అరుణ్ విజయ్‌, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 15 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories