కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... జగన్ గా అజ్మల్...

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... జగన్ గా అజ్మల్...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కి చెందినా రాజకీయ నాయకులుగా ఎవరు కనిపించనున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాకి సంబధించిన పాటలను వర్మ రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ కి చెందినా రాజకీయ నాయకులుగా ఎవరు కనిపించనున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గా ఎవరు నటించనున్నారు అన్నది అందరిలో ఉత్కంటగా మారింది. అయితే ఆ పాత్రలో నటుడు అజ్మల్ కనిపించనున్నాడు. ఇప్పటికి అతని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం జగన్ లాగే అజ్మల్ కనిపిస్తున్నాడు. దండం పెట్టడం, నవ్వడంలో జగన్ ని దింపేశాడు అజ్మల్.. ఈ ఫోటోలను చిత్ర పీఆర్ఓ రమేశ్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. అజ్మల్ రంగం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories