షావోమీ నుంచి అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

షావోమీ నుంచి అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
x
Highlights

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి.. సరికొత్త ప్రయోగానికి ఇదివరకే శ్రీకారం చుట్టింది. ప్రోటోటైప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి.. సరికొత్త ప్రయోగానికి ఇదివరకే శ్రీకారం చుట్టింది. ప్రోటోటైప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తానని చెప్పింది. అయితే ఆ దిశగా అడుగులు వేగంగానే పడుతున్నాయి. ఇందుకు ఉదాహరణ తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోనే.. షావోమి ఓ వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అందులో ఫోల్డబుల్ ప్రోటోటైప్ స్మార్ట్ ఫోన్ యొక్క నమూనాను పరిచయం చేసింది. ఇది డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

కొద్దీ నెలలుగా షావోమి హైలెవెల్ టెక్నీషియన్స్ ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు వీడియో చూస్తేనే తెలుస్తోంది. వీడియోలోని ఫోన్ ని అన్ ఫోల్డెడ్ స్టేట్ లో పోర్ట్రేట్ మోడ్ లో ఉపయోగిస్తూ కనిపిస్తున్నారు. వీడియోలో అతను ఫోన్ ఓరియంటేషన్ మారుస్తాడు. ఫోన్ ను రెండు వైపుల నుంచి మడిచి నూడుల్స్ బాక్స్ లో పెడుతున్నాడు. స్క్రీన్ ఓరియంటేషన్ మార్చడం, ఫోన్ యుఏఐని ట్యాబ్లెట్ మోడ్ నుంచి ఫోన్ మోడ్ లోకి మార్చగానే సాఫ్ట్ వేర్ ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దాకే మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని షావోమి భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories