Happy Kiss Day: ముద్దుతో ఎన్ని లాభాలో..

Happy Kiss Day: ముద్దుతో ఎన్ని లాభాలో..
x
Highlights

ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు ప్రేమికులు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అందులోనూ ముఖ్యంగా 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుపుకునే వాలెంటైన్ డే వీక్ లో ఇంకా ఎక్కువ హుషారుగా ఉంటారు.

ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు ప్రేమికులు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అందులోనూ ముఖ్యంగా 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుపుకునే వాలెంటైన్ డే వీక్ లో ఇంకా ఎక్కువ హుషారుగా ఉంటారు. ఆ వారంలో ప్రేమికులు ప్రత్యేకంగా చాక్లెట్ డే, టెడ్డీ డే, హగ్ డే, కిస్ డే ఇలా ఒక్కో రోజును ఒక్కో స్పెషల్ డేగా జరుపుకుంటారు. అందులోనే ఈ రోజు వాలెంటైన్ వీక్ లో చివరి వారం ఫిబ్రవరి 13వ తేది. ఈ రోజును కిస్ డే గా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ జంటలు మధురమైన ముద్దుతో ప్రేమికులరోజుకు స్వాగతం పలుకుతారు.

ఈ రోజున ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను తన ముద్దుతో వ్యక్త పరుస్తారు. ఈ ముద్దు కేవలం రెండు పెదాల కలయిక మాత్రమే కాదు, భావోద్వేగాలను పంచే ఓ అద్భుతమైన సాధనం. ప్రతిక్షణం మాటల్లో మునిగిపోయే జంటల మధ్య మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికన్నట్లు చుంబనాన్ని సాధనంగా ఉపయోగిస్తారు. ఈ ముద్దు ద్వారా ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ పెరుగుతుంది. దీంతో వారి బంధం మరింత పటిష్టం అవుతుంది. కాబట్టి ముద్దు పెట్టుకోవడం అనేది కేవలం ముద్దు కాదు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

ముద్దువలన కలిగే ప్రయోజనం..

ముద్దుతో మనిషికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ముద్దు మనిషి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాదు ముద్దు పెట్టుకోవడం వల్ల సైటోమెగలోవైరస్ నుండి స్త్రీకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముద్దు ద్వారా ఒకరి నుంచి మరొకరికి బాక్టీరియా బదిలీ కావడంతో ఇద్దరిలో రోగ నిరోధక శక్తి మెరుగువుతుంది. ముద్దు కేలరీలను కరిగిస్తుంది. అంతే కాదు ముద్దు ముఖ కండరాలను బలంగా ఉంచుతుంది. ముద్దు పెట్టుకోవటం వలన ముఖ కండరాలకు పని కలుగుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరం యొక్క సహజమైన శాంతింపజేసే రసాయనమైన ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి. మనిషి శరీరంలో రక్త ప్రసరణ చురుకుగా జరిగడానికి ఉపయోగ పడుతుంది. ముద్దు వల్ల ఒత్తిడి, ఆందోళన, ఆతృత వంటివి క్రమంగా దూరమవుతాయి. ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందుకు కూడా ముద్దు ఉపయోగపడుతుంది. ముద్దు అనేది మానసికంగా మరియు శారీరకంగా ఒత్తిడి మీద పోరాటం చేయటానికి ఒక శక్తివంతమైన ఔషధంగా. ముద్దు జంట మధ్య బంధాన్ని బలంగా ఉంచేలా చేస్తుంది. ముద్దు పెట్టుకోవటం ద్వారా పలు రకాల దంత సమస్యలు కూడా దూరమవుతాయి.

ఈ ముద్దుల్లో కూడా ఎన్నో రకాల ముద్దులు ఉన్నాయి.

నుదటిపై ముద్దు: మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తులను నుదటి పెట్టుకోవటం వలన వారిపై మనకున్న ప్రేమను చూపించవచ్చు.

♦ చేతులపై ముద్దు: చేతులపై మద్దు పెట్టుకోవటం గౌరవానికి, శూరత్వానికి ప్రతీక.

♦ ఎస్కిమో కిస్‌: ఇరువురు ఒకరి ముక్కులను ఒకరు రాసుకోవటాన్ని ఎస్కిమో కిస్‌ అంటారు. ఈ ముద్దును ఎక్కువగా పసి పిల్లల తల్లులు ఉనయోగిస్తూ పిల్లలపై ప్రేమను తెలియజేస్తూ ఉంటారు.

♦ ఫ్రెంచ్‌ కిస్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ముద్దు ఎంతో ప్రాచూర్యం పొందింది. ఈ ముద్దును ప్రపంచంలోనే మోస్ట్‌ రొమాంటిక్‌ కిస్‌ అని కూడా చెప్పొచ్చు. నాలుకలతో ఎదుటి వారిని ముద్దుపెట్టుకోవటం దీని ప్రత్యేకత.

♦ ఫ్లైయిగ్ కిస్త: దూరంలో మనకు ఎంతో నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు వారికి అభిమానంతో ఈ ముద్దును ఇస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories