లవ్ ప్రపోజ్ చేస్తున్నారా...ఈ టిప్స్ మీకోసం..

లవ్ ప్రపోజ్ చేస్తున్నారా...ఈ టిప్స్ మీకోసం..
x
Highlights

ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతుంది. ఈ ప్రేమ అనేది అర్ధం చెప్పలేని ఒక అనుభూతి.

ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతుంది. ఈ ప్రేమ అనేది అర్ధం చెప్పలేని ఒక అనుభూతి. ప్రేమ అనేది యవ్వనంలో వారి మధ్యే మాత్రమే కాదు ఎవరిలోనైనా చిగురిస్తుంది. సృష్టిలోని పుట్టిన ప్రతి జీవి ప్రేమించడం, ప్రేమించబడడం అనేది ఒక అద్భుతమైన వరం. కానీ ప్రతి వ్యక్తి ప్రేమలో పడడం సులువే కానీ ఆ ప్రేమని నిలబెట్టుకుని జీవితాంతం ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా జీవించే విధంగా ఉండాలి. ప్రేమించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం, అతి కొద్దిమందికి మాత్రమే దక్కే అద్భుతమైన వరం. అంటే ప్రేమ ప్రయాణం కాస్త వివాహం వైపునకు వెళ్లే విధంగా ప్రేమించిన వారిని మెప్పించాలి. అంటే ఈ ప్రక్రియ లవ్‌ను ప్రపోజ్ చేయడం దగ్గర నుండే మొదలవుతుంది. ప్రేమ ముందడుగు వేయాలంటే ప్రేమించిన వ్యక్తికి ఏ విధంగా ప్రపోజ్ చేయాలో తెలుసుకుందాం.

ప్రేమను ఎలా వ్యక్త పరచాలి..

ముందుగా ప్రేమించిన వ్యక్తికి అనువైన సమయంలో, అనువైన ప్రదేశంలో ప్రపోజ్ చేయాలి. మీ ప్రపోజల్ వాళ్లకు ఆశ్చర్యాన్ని, అనుభూతిని ఇచ్చే విధంగా ప్రేమను తెలపాలి. ఎదుటి వారి అభిరుచులను పూర్తిస్థాయిలో తెలుసుకుని వాళ్లకి తగినట్లుగా, వాళ్ళ ఇష్టాలకు విలువిచ్చేలా మీ ప్రపోజల్ ఉండేలా చూసుకోండి. ప్రపోజ్ చేయడంలోనే మీకు ఓపిక, సహనం ఖచ్చితంగా ఉండాలి. ఎదుటి వారిని చూడగానే వారిని ప్రపోజ్ చేయకూడదు. ఇక పోతే కొంత మంది ప్రేమను వ్యక్త పరచడానికి ఎంతో సమయాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో నిదానమే ప్రదానం అనుకున్నాపరిస్థితులను అనుసరించి నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. అనువైన సమయం చూసుకుని ప్రపోజ్ చేయాలి. లేదంటే ఆలస్యం జరిగే కొద్దీ, మీకు వారిమీద ఆసక్తి లేదేమో అన్న ఆలోచన వారికి కలగవచ్చు.

ఇంకొంత మంది సినిమాలు చూసి ఆ తరహాలో అమ్మాయి వెంట పడి డైమండ్ రింగులు ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అని అనుకుంటారు. ఇవన్నీ కూడా సినిమాల్లో మాత్రమే బావుంటాయి, నిజ జీవితంలో అస్సలు కుదరవు. ఇంకొంత మంది ప్రపోజింగ్ చేయడానికి ముందు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే అవతలి వారికి మీ చర్య, శారీరిక సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మీ ప్రేమకు నో అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి, ముద్దు, లేదా కౌగిలింత వంటి ఆలోచనలు ఉంటే ఆచితూచి వ్యవహరించడం మేలు. ఇక మీరే ఆలోచించుకోండి మీ ప్రేమను ఏ విధంగా వ్యక్త పరిస్తే మీ పార్ట్ నర్ మీకు సొంతం అవుతారో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories