యాంటీ బయోటిక్స్‌తో జరభద్రం

యాంటీ బయోటిక్స్‌తో జరభద్రం
x
యాంటీ బయోటిక్స్‌
Highlights

కాలం మారింది. ఇప్పుడు ఏదైనాసరే వేగంగా అనుకున్న వెంటనే జరిగిపోయాలి. ఇక, మారిన జీవనశైలికి అనుగుణంగా మార్కెట్లో అన్నీ క్షణాల్లో దొరికే వెసులుబాటు కూడా...

కాలం మారింది. ఇప్పుడు ఏదైనాసరే వేగంగా అనుకున్న వెంటనే జరిగిపోయాలి. ఇక, మారిన జీవనశైలికి అనుగుణంగా మార్కెట్లో అన్నీ క్షణాల్లో దొరికే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆ ఆత్రుతే ఇప్పుడు కొంప ముంచుతోంది. త్వరగా తగ్గిపోవాలన్నా ఆశతో ప్రతి చిన్న దానికీ యాంటీ బయోటిక్స్ మింగేస్తున్న ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఏదైనా రోగం వస్తే టాబ్లెట్ వేసుకోవడం సహజం. కానీ చిన్న చిన్న జబ్బులకే యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నారు జనం. రెండు మూడ్రోజుల్లో తగ్గే జలుబు, జ్వరం లాంటి ఇన్ఫెక్షన్స్‌కు కూడా త్వరగా తగ్గాలనే ఆత్రుతతో యాంటీ బయోటిక్స్ వాడేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా, ప్రతి చిన్న దానికీ యాంటీ బయోటిక్స్ వాడేయడం మూలాన టాబ్లెట్స్ రివర్స్ అవుతున్నాయని, పెద్దపెద్ద రోగాలకు యాంటీ బయోటిక్స్ పనిచేయడం లేదని డాక్టర్స్ అంటున్నారు.

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదంటున్నారు డాక్టర్స్. అయితే, కొందరు డాక్టర్స్ ఫార్మా కంపెనీలతో లాలూచీపడి యాంటీ బయోటిక్స్‌ను ఎక్కువగా రాస్తున్నారని, ఇక మెడికల్ షాప్స్ నిర్వాహకులు కూడా ప్రిస్కప్షన్ లేకుండా ఇష్టమొచ్చినట్లు యాంటీ బయోటిక్స్ విక్రయిస్తున్నారని అంటున్నారు.

యాంటీ బయోటిక్ వాడకం తగ్గించాలంటే ముందుగా కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడం మంచిదని డాక్టర్స్ అంటున్నారు. ముఖ్యంగా టీకాలతో సీజనల్ వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చని అంటున్నారు. యాంటీ బయోటిక్స్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే వ్యాక్సిన్స్ వేసుకోవడం బెటర్ అంటున్నారు. యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరముందంటున్నారు డాక్టర్స్‌. ప్రభుత్వమే జోక్యం చేసుకుని యాంటీ బయోటిక్ నియంత్రణ పాలసీ తీసుకురావాల్సిన అవసరముందని, లేదంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories