Top
logo

చాక్లెట్ డే 2020: చాక్లెట్లతో అద్భుతమైన ఆరోగ్యం

చాక్లెట్ డే 2020: చాక్లెట్లతో అద్భుతమైన ఆరోగ్యం
X
Highlights

చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి.

చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. ఇక పోతే ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు పండగ అనే చెప్పుకోవాలి. ఈ నెలలో ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు వస్తుంది. అంతే కాదు అంతకు ముందు రోజులు కూడా వారికి ఎంతో ప్రత్యేకమైన రోజులు అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 9వ తేదీని చాక్లెట్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. అంతే కాకుండా ఈ నెలలో ప్రేమికుల కోసం రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే ఇలా ఎన్నో స్పెషల్ డేస్ వస్తాయి. ఈ రోజుల్లో ఇద్దరూ ఒకిరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుని ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటారు.

అంతే కాదు స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టెలలో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్ళి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.

చాక్లెట్ తినడం వలన కలిగే లాభాలు..

కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. ఉష్ణమండలాలలో పెరిగే కాఫీ, టీ, కోకో (కకోవా), మొదలైన మొక్కలన్నీ ఇటువంటి ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చెయ్యడమనేది గమనించవలసిన విషయం.

అతిగా తింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి నల్ల చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నల్ల చాకొలెట్లో- కేటచిన్‌ అనే షాడబార్థం (ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను వ్యాకోచించేటట్లు చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. కకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.

ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫ్రీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్లు చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది.

చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక.

ప్రపంచంలోనే ఖరీదైన చాక్లెట్లు...

నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకొపొలాజి ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్‌తో తయారయ్యే దీన్ని ఆర్డరుమీద చేస్తారు. అరకిలో సుమారు రూ. 2 లక్షలు ఉంటుంది.

తరవాతి స్థానం సుమారు రూ. 56 వేల ఖరీదు చేసే నోకా వింటేజ్ కలెక్షన్‌ది. దీనికోసం ట్రినిడాడ్, ఈక్వెడార్, వెనెజులా, కోట్ డీవార్ నుంచి కకోవా గింజల్ని సేకరిస్తారు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతోనూ చేసే డెలాఫీది మూడో స్థానం. సుమారు రూ. 33 వేలు. ఇక పోతే బార్ విషయానికొస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పాదే ప్రథమస్థానం. దీని ఖరీదు రూ. 1లక్షా ఆరువేలు.

Web TitleChocolate day 2020 third day of valentine week 5 amazing health benefits of chocolates
Next Story