Top
logo

టైట్ జీన్స్ తో డేంజరేనా?

టైట్ జీన్స్ తో డేంజరేనా?
X
Highlights

మీకు జీన్స్‌ వేసుకునే అలవాటుందా..? అందులోనూ స్కిన్‌ టైట్‌ వేసుకుంటున్నారా..? అయితే మీకు చర్మ సంబంధిత సమస్యలు...

మీకు జీన్స్‌ వేసుకునే అలవాటుందా..? అందులోనూ స్కిన్‌ టైట్‌ వేసుకుంటున్నారా..? అయితే మీకు చర్మ సంబంధిత సమస్యలు రావడం ఖాయం. ఈ మాట నేను అనడం లేదండి వైద్యులు వార్నింగ్‌ ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు స్కిన్‌ టైట్‌ జీన్స్‌ వేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

జీన్స్‌.. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ సంచలనం. కాటన్‌, స్ట్రెచ్‌, టైట్‌ ఫిట్‌, జాగరీ ఫిట్‌ జీన్స్‌ ఇలా అనేక రకాలు. కానీ ఇప్పుడు జీన్స్‌ని వేసుకోవడం వలన చాలా రకాల చర్మ సమస్యలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. టైట్‌ జీన్స్‌ వేసుకోవడం వల్ల ప్రతి 100 మందిలో 10 మందికి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇటువంటి టైట్ జీన్స్‌లను ధరించడంవల్ల గజ్జి, తామర, శోభి లాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే జీన్స్‌ వంటివి వేసుకోవడంతో చాలా అనుకూలంగా ఉందని యువత చెప్తున్నారు. ఒకప్పుడు లేని స్కిన్ సమస్యలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయనడం కేవలం అవాస్తవం అంటున్నారు. విదేశాల్లో ధరించే దుస్తులు కూడా అధిక శాతం జీన్స్‌లే అని, అక్కడ లేని సమస్యలు ఇక్కడ మాత్రమే ఉన్నాయా అని యువత ప్రశ్నిస్తున్నారు. తమకు అన్ని విధాల జీన్స్‌ కంఫర్ట్‌గా ఉంటుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే టైట్‌ జీన్స్‌ వేసుకుంటే అనేక సమస్యలు వస్తాయని డాక్టర్స్‌ హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యగా ఉన్నప్పుడు గుర్తించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ ప్రియ తెలిపారు. ముఖ్యంగా తామర వ్యాధి బారిన పడేవారు ఎక్కవగా ఉన్నారంటున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్న దుస్తులను ధరించాలని చెప్తున్నారు. అందానికి ప్రాముఖ్యత ఇవ్వడమే కాదు, ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలని, టైట్‌గా ఉండే జీన్స్‌ బదులు వదులుగా ఉండే దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Next Story