బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? బీర్‌తో అధిక బరువుకు చెక్..

బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? బీర్‌తో అధిక బరువుకు చెక్..
x
Highlights

బరువు తగ్గాలనుకుంటున్నారా? అందుకోసం వ్యాయామాలు తెగ చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం బీర్‌ తాగితే చాలు. ఆటోమెటిక్‌గా స్లిమ్‌గా...

బరువు తగ్గాలనుకుంటున్నారా? అందుకోసం వ్యాయామాలు తెగ చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం బీర్‌ తాగితే చాలు. ఆటోమెటిక్‌గా స్లిమ్‌గా తయారవుతారట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండీ మీకే అర్థమవుతోంది.

మందుబాబులం.. మేము మందుబాబులం.. మందుకొడితే మాకు మేమే మ‌హారాజులం అన్నాడో సినీ క‌వి. మందు కొట్టాక మ‌హారాజు అయ్యే సంగ‌తి ప‌క్కన‌ పెడితే ఇకపై ఆ కిక్కే టానిక్‌గా మారుతోందట. ఫ్రెండ్స్‌ వచ్చినా. చుట్టమొచ్చినా బాధైనా సంతోషమైనా.. వేడుక ఏదైనా మందులో తేలిపోయే తాగుబోతులకు ఆ నిషామత్తే హెల్త్‌గా మారుతోందని ఓ రిపోర్ట్‌లో తేలింది.

మందు.. ఆ పేరు వింటేనే ముందుబాబులకు కిక్‌ ఎక్కుతోంది. అల్లంత దూరం నుంచి వచ్చే వాసనకే హాంగోవర్ వస్తోంది. బీర్‌ తాగితే స్ట్రెస్ తగ్గుతుందని చాలామంది సీసాలకు సీసాలు తెగతాగేస్తుంటారు. ఇక బీర్‌ స్ట్రెస్‌నే కాదు సర్వరోగ నివారిణిగా మారిందని లండన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా బీర్‌ తాగడం వల్ల పొట్ట పెరుగుతుందని చాలామందిలో ఉన్న అపోహకు చెక్‌పెట్టింది. ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లో బీర్‌ తాగితే పొట్ట రాదని బీర్ డైట్‌గా మారుతోందని రిపోర్ట్‌లో వెల్లడించాయి. సరదాగా తాగే బీర్ వలన దుష్ప్రభావాలు ఎన్ని ఉన్నాయో ప్రయోజనాలూ అన్ని ఉన్నాయని లండన్‌ శాస్త్రవేత్తలు చెప్పడంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు. బీర్‌ తాగడం వల్ల పొట్ట తగ్గడంతో పాటు స్లిమ్‌గా తయారవుతారని చెప్పడంతో పెగ్గులకు పెగ్గులు ఖాళీచేసేందుకు రెడీ అవుతున్నారు. పైగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో బీర్‌ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ వస్తుందనేది అబద్ధమని చెప్పేశారు.

కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే బీరులోని ప్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయని రిపోర్టులు చెప్పడటంతో తాగుబోతుల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.అయితే ఇండియన్‌ డాక్టర్లు మాత్రం రిపోర్ట్‌ను తప్పుబడుతున్నారు. ఆల్కాహల్‌ అనేది లండన్‌ అయినా ఇండియాలో అయినా ఒకేలా పని చేస్తందని అంటున్నారు. అది తాగడం వల్ల ఎక్కడైనా ఒకే విధమైన చర్యలు ఉంటాయంటున్నారు. పైగా బీర్‌ను ఇష్టంగా తాగేవారు ఇక మంచినీళ్లలా తాగేస్తారని హెచ్చరిస్తున్నారు. లండన్‌ శాస్త్రవేత్తలు చెప్పింది మందుబాబులు ఫాలో అయితే.. ఇకపై పాలు తెచ్చుకున్నట్లు బీర్లను ఇంటికే తెచ్చేసుకుంటారేమో మరి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories