పాజిటివ్ ఆటిట్యూడ్ తో కరోనా ను జయించవచ్చు!

పాజిటివ్ ఆటిట్యూడ్ తో కరోనా ను జయించవచ్చు!
x
Highlights

సంతోషం సగం బలం అంటారు పెద్దవారు. అందుకేనేమో చాలా మంది ఉదయాన్నే లేచి లాఫింగ్ క్లబ్ లకి వెల్లి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు.

సంతోషం సగం బలం అంటారు పెద్దవారు. అందుకేనేమో చాలా మంది ఉదయాన్నే లేచి లాఫింగ్ క్లబ్ లకి వెల్లి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అలా మనిషి సంతోషంగా ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎంతటి ఒడిదుడుకులనైనా ఎదురుకునే మనో ధైర్యం కలుగుతుందంటారు. ఎన్ని మందులు వాడినా నయం కాని రోగాలు సంతోషంతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే తగ్గుతున్నాయనీ అంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో వ్యాపిస్తున్న కరోనాను కూడా ఇదే విధంగా మనో ధైర్యంతో, పాజిటివ్ ఆలోచనలతో తరిమేయవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎదురుకున్న కష్టాలతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్యే కాదంటున్నారు. ఒక వేల వైరస్ వ్యాపించినా దాన్ని ధైర్యంగా ఎదురుకోవచ్చంటున్నారు సైకాలజిస్టులు. వారు చెప్పిన సూచనలను పాటిస్తే వైరస్ ను సులువుగా తమ శరీరం నుంచి తరిమేయవచ్చు అని చెపుతున్నారు. అందు కోసం ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా ఆలోచించాలని తెలిపారు.

అయితే చాలా మందికి ఒక సందేహం రావొచ్చు అసలు సంతోషంగా ఉండడం వలన వ్యాధులు ఎలా నయం అవుతాయని. నిజానికి మనిషి సంతోషంగా, పాజిటివ్‌గా ఉన్నప్పుడు శరీరంలో ఉండే కణాలన్నీ చాలా ఉత్తేజంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా ఎంతో ఉత్తేజంగా ఉంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి హాని కలిగించే వైరస్ లు అంటే కరోనా లాంటి వైరస్ లు శరీరంలోకి వెల్లి కణాలపై దాడి చేస్తే మంచి బ్యాక్లిరియా చెడు వైరస్ లతో పోరాడి వాటిని చంపేస్తుంది. అందునే ఎంతటి అనారోగ్యం వచ్చినా మనిషి పాజిటివ్ గా, యాక్టివ్ గా ఉండాలని చెబుతారు. ఏ వైరస్ అయినా మనల్ని ఎటాక్ చెయ్యాలంటే మనం వీక్ అవ్వాలి. అలా కాకుండా బలంగా ఉంటే చాలు వైరస్‌ల ఆటలు మన దగ్గర సాగవు.

అలా సంతోషంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

1. యోగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనిషి ఖచ్చితంగా యోగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి కాలంలో తినే తిండి కారణంగా మనిషికి సరైన పోషకాలు లభించడంలేదు, అంతే కాక పనితీరులో కూడా మార్పులు రావడంతో మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ప్రతి మనిషి ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయడం వలన ఫిట్‌నెస్ పెరుగుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

2. మొక్కల్ని నాటడం వలన పరిసరాల్లో వాతావరణం కాలుష్యం లేకుండా ఉంటుంది. ఉదయాన్నే కంటికి పచ్చదనం కనిపిస్తే మనిషి ఆరోజంతా ఎలాంటి టెన్షన్స్ లేకుండా సంతోషంగా ఉంటాడని చెబుతుంటారు. అంతే కాక మొక్కల ద్వారా స్వచ్చమైన గాలి రావడంతో మనిషి యాక్టివ్ గా ఉంటాడు. అంతే కాదు ఇంట్లో బోర్ కొట్టినపుడు అలా సరదాగా డాబాపైకో, లేదా గార్డెన్లోకో వెలితే ప్రకృతి నుంచి, సూర్యుని నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి.

3. కొత్తగా ఏదైనా కనిపెట్టం, లేదా ట్రై చెయ్యడం. ప్రస్తతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండనే ఉన్నాయి. ఆ ఫోన్లలో ఫన్నీ వీడియోస్ చేయడం, ఫన్నీ మెసేజెస్ చేయడం ద్వారా కాస్త ఉత్సహాన్ని పొందుతారు. అంతే కాదు ఇతరుల ఫన్నీ వీడియోలు కూడా చూడాలి దానికి యూట్యూబ్, టిక్ టాక్ ఉండనే ఉన్నాయి.

4. ఎదుటివారిని సంతోషంగా ఉంచడం వలన మీరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని చెబుతున్నారు సైన్ టిస్టులు. మనకు ఇష్టం అయిన వారికి సప్రైజ్ గిఫ్ట్ ఇస్తే వారు ఎంతో సంతోషాన్ని పొందుతారు. అలా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. అంతే కాదు మన చట్టు పక్కన వారిని కూడా సంతోషంగా ఉంచే విధంగా వారికి సాయం చేయాలి. అప్పుడు వారు చెప్పే థాంక్స్ మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.

5. స్వయంగా వంట చెయ్యడం వల్ల కూడా ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. తాము చేసిన వంటలను ఎవరైనా మెచ్చుకుంటే ఆ ఆనందం అంతా ఇంతా ఉండదు. అందులోనూ క్రియేటివిటీని ఉపయోగించి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తే ఎంతో రిలాక్స్ ఫీల్ అవుతారు.

6. గతంలో జరిగిన విపత్తుల్ని, దారుణాలను ఒక్క సారి తలచుకుని, ఆసమయంలో ఎంత ధైర్యంగా ఉన్నామో తలచుకోవాలి. అలా చేస్తే మనలో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ రంగు రంగుల బొమ్మలను వేయండి మనసులకు ఎంతో హాయి ఇస్తుంది.

7. ప్రతి సారి కరోనా గురించిన వార్తలు చూస్తూ ఉండకుండా కేవలం ముఖ్యంశాలు మాత్రమే చూడండి. ఆ తరువాత వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూడండి. ముఖ్యంగా వైరస్ గురించి ఎవరైనా భయంకరంగా చెబితే... అస్సలు పట్టించుకోవద్దు, అప్రమత్తంగా ఉండాలి అలా చేస్తే ఎంతో కొంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. కరోనా నెగెటివ్ వార్తల్ని పట్టించుకోవద్దు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories