నేటినుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..

నేటినుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు..
x
Highlights

కొత్త సంవత్సరం మొదట్లోనే కొందరు వినియోగదారులకు చేదువార్త చెప్పింది 'వాట్సాప్' . భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఆండ్రాయిడ్ ఓఎస్‌,...

కొత్త సంవత్సరం మొదట్లోనే కొందరు వినియోగదారులకు చేదువార్త చెప్పింది 'వాట్సాప్' . భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఆండ్రాయిడ్ ఓఎస్‌, యాపిల్ ఐఓఎస్‌ సపోర్ట్‌ చేయబోదని దాంతో కొన్ని ఫోన్లలో వాట్సాప్ ఫీచర్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అందులో 'నోకియా ఎస్‌ 40' ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్‌లో కూడా వాట్సప్‌ ను నిలిపివేశారు. వాట్సాప్ సేవలు కొనసాగాలంటే ఓఎస్‌ 4.0 ప్లస్‌, ఐఓఎస్‌ 7 ప్లస్‌ లేదా విండోస్‌ ఫోన్‌ 8.1 ప్లస్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని వాట్సాప్ తన బ్లాగుల్లో రాసుకొచ్చింది.

ఇక ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.3 .. అలాగే ఇంతకంటే పాత ఓఎస్‌, విండోస్‌ ఫోన్‌ 7, ఐఫోన్‌ 3జీఎస్‌/ఐఓఎస్‌ 6, నోకియా సింబియన్‌ ఎస్‌ 60 వెర్షన్లలో వాట్సాప్ సేవలు ఉండవు. యాపిల్ లో ఐఓఎస్‌ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్‌ 4, ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ, ఐఫోన్‌ 5ఎస్‌.. ఐఓఎస్‌ 7 ఆధారంగా నడుస్తున్నాయి. వీటికి ఎటువంటి డోకా లేదని వాట్సాప్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories