ఎన్నికల సమరంలో సరికొత్త ట్రెండ్...వివిధ పార్టీలకు నయా టెన్షన్

ఎన్నికల సమరంలో సరికొత్త ట్రెండ్...వివిధ పార్టీలకు నయా టెన్షన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హోరు పతాకస్థాయికి చేరింది. ప్రచారగడువు ముగియటానికి మరికొద్దిగంటల సమయం మాత్రమే మిగిలిఉండడంతో వివిధ పార్టీల అధినేతల గుండెల్లో...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హోరు పతాకస్థాయికి చేరింది. ప్రచారగడువు ముగియటానికి మరికొద్దిగంటల సమయం మాత్రమే మిగిలిఉండడంతో వివిధ పార్టీల అధినేతల గుండెల్లో గుబులు ప్రారంభమయ్యింది. ఎన్నికల ప్రచార సభలకు జనం తండోపతండాలుగా వచ్చినా వారి అభిమానం ఓట్లుగా సీట్లుగా మారుతుందా? అన్న సందేహం వెంటాడుతోంది.

నవ్యాంధ్రప్రదేశ్ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు రెండోసారి జరుగుతున్న జమిలి ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారం గడువు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉండడంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన అధినేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఆఖరి నిముషం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలతో పాటు జనసేన ఎన్నికల ప్రచారసభలకు సైతం జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీరిలో

మోతం జనం ఎవరో? పార్టీ పైన అభిమానంతో వచ్చిన జనం ఎవరో ? ఎంత మందో ? తెలియక రాజకీయ విశ్లేషకులు ఓ వైపు తికమకపడుతుంటే మరోవైపు వచ్చినవారంతా తమకు ఓట్లు వేస్తారా? అన్న అనుమానం వివిధ పార్టీల వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ఎన్నికల సభలకు భారీసంఖ్యలో జనం వచ్చినా అది ఓట్లు, సీట్ల శాతంలో ప్రతిఫలించకపోవడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్ గా రాజకీయపార్టీలకు నయా టెన్షన్ గా మారింది. జనం జోరుగా వచ్చినా సీట్ల పరిస్థితి బేజారుగా మారిన సందర్భాలు గత ఎన్నికల వరకూ ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. 20 శాతం ఓట్లు సాధించినా సీటుకు గ్యారెంటీ లేకపోడం సాధారణ విషయంగా మారింది.

ఐదేళ్ల క్రితం ముగిసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలిఎన్నికల ఫలితాలు గుర్తు చేసుకొంటే తక్కువశాతం ఓట్లు సాధించిన టీడీపీ ఎక్కువసీట్లు, ఎక్కువశాతం ఓట్లుసాధించిన వైసీపీ తక్కువ సీట్లు సాధించడం మనకు కనిపిస్తుంది. 2014 శాసన సభ ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీపడిన వైసీపీ 44.90 శాతం ఓట్లు సాధించినా చివరకు మిగిలింది 67 సీట్లు మాత్రమే కావడం విశేషం. వైసీపీ కేవలం 5 లక్షల 63వేల ఓట్ల తేడాతో అధికారం చేజార్చుకొంది.

బీజెపీ, జనసేన కారణంగా వైసీపీకి దాదాపు 9 లక్షల ఓట్లు దక్కకుండా పోయాయి. వైసీపీ కంటే టీడీపీ-బీజెపీ కూటమి కేవలం 1.96 శాతం ఓట్ల తేడాతోనే అందలాన్ని అందుకోగలిగింది. టీడీపీ కూటమి 46.86 శాతం ఓట్లతోనే 106 సీట్లు సొంతం చేసుకోగలిగింది. 2014 ఎన్నికల్లో మొత్తం 2కోట్ల 87 లక్షల 94వేల 902 ఓట్లు పోలైతే అందులో టీడీపీ-బీజెపీ కూటమికి కోటీ 34 లక్షల, 95వేల 305 ఓట్లు వచ్చాయి.

వైసీపీ పార్టీ కోటీ 29 లక్షల 31వేల 730 ఓట్లు సంపాదించినా 67 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని నియోజకవర్గాలలో భారీ ఆధిక్యంతో గెలిచినా మరికొన్ని నియోజకవర్గాలలో స్వల్పతేడాతో ఓటమి పొందటమే ఈ పరిస్థితికి కారణమని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. అదే పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందేమోనని ప్రధానపార్టీల నేతలు కంగారు పడుతున్నారు.

ఏపీలోనూ అత్యధిక నియోజకవర్గాలలో ముక్కోణపు పోటీలే ఎక్కువగా ఉండడంతో ఎవరి కొంప మునుగుతుందోనని ఇటు టీడీపీ అటు వైసీపీ లోలోపల మధన పడిపోతున్నాయి. ఏదిఏమైనా నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభకు రెండోసారి జరుగుతున్న ఎన్నికలు సైతం ఆసక్తికరమైన, అనూహ్య ఫలితాలు ఇస్తాయా? వేచిచూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories