వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
x
Highlights

వైఎస్‌ఆర్‌ఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో భేటి అయిన పార్టీ...

వైఎస్‌ఆర్‌ఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో భేటి అయిన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్‌ను తమ పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. పార్టీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యులతో జగన్ కాసేపట్లో భేటి కానున్నారు. లోక్‌సభలో వైసీపీ పక్ష నేతను ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశం ముగియగానే అమరావతి నుంచి జగన్ హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. దీంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యి ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ ఆహ్వానించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories