logo

ఆ భ్రమలో ఉన్న చంద్రబాబును చిత్తుగా ఓడించాలని: రోజా

ఆ భ్రమలో ఉన్న చంద్రబాబును చిత్తుగా ఓడించాలని: రోజా

ఏపీకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం చోడవరంలో జరిగిన వైఎస్సార్‌ సీపీ మహిళ గర్జనలో ఎమ్మెల్యే రోజా పాల్గోన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు చీరలు ఇస్తే ఓటు వేస్తారనే పిచ్చి భ్రమలో ఉన్న చంద్రబాబును మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వకపోగా తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్‌ కంపెనే ఇచ్చారని ఎమ్మెల్యే రోజా తీవ్రస్ధాయిలో విమర్శించారు.

లైవ్ టీవి

Share it
Top