'ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారు'

ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేదలు తల్లడిల్లిపోతున్నారు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సర్కార్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సర్కార్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ వైఖరితో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిరాకరిస్తుంటే పేద ప్రజలు తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ వర్క్ దవాఖానలకు ఏపీ సర్కార్ కోట్ల రూపయలు బకాయి పడిందని గోపిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన లక్షల క్లెయిమ్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీలో రెండు వేల మంది ఆరోగ్యమిత్రులు అవసరమైతే కాని ప్రస్తుతం మాత్రం కేవలం 700 వందల మంది మాత్రమే ఉన్నారని ఏపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. పలు దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories