టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి
x
Highlights

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైపీసీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శించాడు. చంద్రబాబు ఓటమి...

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైపీసీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విమర్శించాడు. చంద్రబాబు ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పాలన పాకిస్థాన్ ప్రభుత్వం కన్నా ఘోరంగా ఉందని విమర్శించారు. టీడీపీ నేతలకు ఏపీ పోలీసులు తొత్తులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విరుచుకపడ్డారు. మంగళవారం వైసీపీ కార్యక్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రాజ్యంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టి, వెంటనే టీడీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories