Top
logo

'నేను పార్టీ మారడం లేదు'

నేను పార్టీ మారడం లేదు
X
Highlights

తాను వైసీపీ పార్టీ వీడీ వేరే పార్టీకి మారుతున్నట్లు ఎల్లో మీడియా తనపై దుష్పచారం చేస్తుందని వైసీపీ నేత, మాజీ...

తాను వైసీపీ పార్టీ వీడీ వేరే పార్టీకి మారుతున్నట్లు ఎల్లో మీడియా తనపై దుష్పచారం చేస్తుందని వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కావాలనే పచ్చ మీడియా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తుందని అన్నారు. తాను ఏ పార్టీ మారడంలేదని వైసీపీలోనే ఉంటానని పార్థసారథి స్పష్టం చేశారు. మళ్లీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తాలు రాస్తే సహించేదే లేదని తప్పకుండా కఠిన చర్చలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం పార్థసారథి ఉయ్యూరు మండలంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. పసుపు, కందికి సరైనా గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కాని ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యహరిస్తుందని అన్నారు.

Next Story