Top
logo

త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది: అలీ

త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది: అలీ
X
Highlights

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో వలసలు జోరుగానే సాగుతున్నాయి. ...

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో వలసలు జోరుగానే సాగుతున్నాయి. కాగా తాజాగా వైసీపీ తీర్థంపుచ్చకున్న ప్రముఖ నటుడు అలీ వైసీపీ పార్టీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని అలీ అన్నారు. గురువారం ఆర్‌ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖ నటుడు అలీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరని అలీ స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రానికి జగన్‌ రావాలి-జగన్‌ కావాలి అని అలీ వ్యాఖ్యానించారు. ఏపీకి జగన్ మోహన్ రెడ్డి అవసరం ఎంతో ఉందన్నారు. తప్పకుండా త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అలీ అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను గెలిపించి సీఎంను చేద్దామని కార్యకర్తలకు అలీ పిలుపునిచ్చారు.

Next Story