Top
logo

వైసీపీలో వేలం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక: చంద్రబాబు

వైసీపీలో వేలం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక: చంద్రబాబు
X
Highlights

మనం పిలుపు ఇస్తే ప్రపంచం అంతా వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందని అదే జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే...

మనం పిలుపు ఇస్తే ప్రపంచం అంతా వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందని అదే జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే రాష్ట్రానికి కాలు కూడా పెట్టరని పారిపోతారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంతకు ముందు జరిగిన ఘటనలు చూస్తే పెట్టుబడులు పెట్టిన వారంతా జైళ్లో రూంమెట్స్ గా తయారయిన ఘటనలున్నాయన్నారు.

లోటస్ పాండ్ లో ఓ పెద్ద ఎస్టేట్ కట్టుకుని మహా కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరు ఏ కుట్ర చేసినా మమ్ముల్ని ఏం చేయలేరన్నారు. అదే మా నీతి నిజాయితీ అన్నారు. ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. వల్గర్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆశయం లేదన్నారు. నాలుగు రోజులు అసెంబ్లీకి వచ్చారు.. కూర్చోనే ఓపిక లేదు బాయ్ కాట్ చేశారు అని విమర్శించారు. వైసీపీలో వేలం ప్రకారమే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్లకే వైసీపీ టికెట్ దక్కుతుందన్నారు. టీడీపీలో మాత్రం ప్రజాసేవే అభ్యర్ధుల ఎంపికకు ప్రామాణికమని చెప్పారు. గాలికి వచ్చినోళ్లు గాలికే పోయే పరిస్థితి ఉందన్నారు. మళ్లీ టీడీపీలోకి వస్తామంటే వద్దని చెప్పామన్నారు చంద్రబాబు.

Next Story