కడప గడపపై వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ ధీమా?

కడప గడపపై వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ ధీమా?
x
Highlights

"ఏపీ ఎన్నికల ఫలితాలు" ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎవరి నోటా విన్న కానీ ఇదే మాట. ఎందుకంటే ఈ ఫలితాలే ఏపీ సీఎం కూర్చి ఎవరనేది నిర్ణయించునున్నాయి. ముఖ్యంగా...

"ఏపీ ఎన్నికల ఫలితాలు" ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎవరి నోటా విన్న కానీ ఇదే మాట. ఎందుకంటే ఈ ఫలితాలే ఏపీ సీఎం కూర్చి ఎవరనేది నిర్ణయించునున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ ఉద్దండులా మధ్య జరుగుతున్న పోరు కాబట్టి ప్రతిఒక్కరి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు అపరచాణిక్యుడు ప్వూహాలకు ప్రతిప్యూహాలు వేసే నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు ఎవరి అండదండ లేకుండానే ఏపీలో వైసీపీ పార్టీని ఒంటి చేతితో నెట్టుకొస్తూ అధికార పార్టీకి ముచ్ఛేమటలు పట్టిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండటంతో ఏపీ పోరుపైనే అందరి దృష్టి పడింది. అయితే పోయిన ఏడాది తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందంటే అందుకు గల కారణం గోదావరి జిల్లాలే అనే చెప్పవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తం టీడీపీయే విజకేతనం ఎగురవేసింది. 15 సీట్లు టీడీపీ గెలుపులో కీలకంగా మారాయి. కాగా ఈ 2019 ఎన్నికల సమరంలో ఈ రెండు గోదావరి జిల్లాలే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాదిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి గోదావరి జిల్లాలే అధికారానికి అండ,దండగా నిలిచాయి. మరి ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి హోంగ్రౌండ్ అయిన కడప జిల్లా పట్టం కట్టబోతుందన్న అంచనాకు వైసీపీ వర్గాలు వచ్చాయి. ఈ ఎన్నికల పోలింగ్‌లో వైసీపీకే అనుకూలంగా ఉందని, వైసీపీ నేతల పోల్ మేనేజ్ మెంట్ ఫలితం కనిపించిందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2004 వరకు కడప జిల్లాలో టీడీపీ పెత్తనమే ఉండేది. వైఎస్ మైసూరా, డీఎల్ వంటి గట్టి నేతలున్నా అప్పట్లో టీడీపీ భారీ మెజార్టీ సీట్లు సాధించింది. అయితే రాను రాను క్రమంగా టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. గత 2004లో కడపలోటీడీపీ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక 2009లో కేవలం ఒకే ఒక్క ఒక్కస్థానం. ఇక 2014లోనూ ఒకే స్థానానికి టీడీపీ సరిపెట్టుకుంది. రాజంపేట ఒక్కటే గెలిచి టీడీపీ పరువు దక్కించుకుంది. ఇక 2004 నుండి టీడీపీ ఇప్పడి వరకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు ప్రత్యర్థి పార్టీలు.

కాగా గత 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి సహా చాలా మందిని లాగేసి టీడీపీ బలపడింది. కనీసం ఐదారు సీట్లు కమలాపురం, రైల్వే కోడూరు , మైదకూరు, జమ్మలమడుగు, రాయచోటీ టీడీపీకి విజయావకాశాలున్నాయని ఆ పార్టీ అంచవేసింది. అయితే పోలింగ్ సరళి పరిశీలించాక మాత్రం వైసీపీలో ఫుల్ జోష్ అవుపిస్తోంది. టీడీపీ పోల్ మేనేజ్ మెంట్ వైఫల్యంతోపాటు వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేవ్ గట్టిగానే వర్కవుట్ అయిందని టీడీపీ విజయావకాశాలను ఇవే తీవ్రంగా దెబ్బతీశాయన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా జగన్ జిల్లా కావడంతోనే పక్క ప్లాన్‌తో వైసీపీ నేతలు ముందుకెళ్లారు. ఇక దీంతో ఈసారి కడప జిల్లాలో వైసీపీ క్లీన్ చేస్తామన్న అంచనాకు వచ్చేశారట. మొత్తానికి కడప జిల్లాలో జగన్ క్లీన్ స్వీన్ చేస్తారా లేదా అన్నది చూడాలంటే మే 23న వరకు వేచి చూడాల్సిందే మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories