Top
logo

25 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ..!

25 పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ..!
Highlights

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్లమెంట్ సీట్లను దాదాపు ఖరారు చేశారు. కేంద్రంలో కూడా తమ...

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్లమెంట్ సీట్లను దాదాపు ఖరారు చేశారు. కేంద్రంలో కూడా తమ పాత్ర ఉండాలని భావిస్తున్న వైసీపీ మూడు నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఓ వైపు అన్నపిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతూనే పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ దృష్టి సారించారు. ఈ సారి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్న జగన్ ఇందుకోసం 25 స్థానాలకు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు.

శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ, విశాఖ- ఎంవివి చౌదరి, అనకాపల్లి - వరద కల్యాణి లేదా కొణతాల, అరకు - గొట్టేటి మాధవి, కాకినాడ - బలిజి అశోక్, రాజమండ్రి - మార్గాని భరత్, అమలాపురం- చింతా అనురాధ, నరసాపురం - రఘురామ కృష్ణంరాజు, ఏలూరు - కోటగిరి శ్రీధర్ లేదా కావూరి సాంబశివరావు, విజయవాడ - దాసరి జై రమేష్, మచిలిపట్నం - బాల‌సౌరీ పోటీ చేసే అవకాశం ఉంది.

ఇక గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, నరసరావు పేట నుంచి శ్రీ కృష్ణ దేవరాయలు, ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు - మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట - మిథున్ రెడ్డి, కడప - అవినాష్ రెడ్డి, హిందూపూర్ - గోరంట్ల మాధవ్, అనంతపురం - పిడి రంగయ్య, నంద్యాల - శిల్పా రవిచంద్ర లేదా పోచే మాధవ్ రెడ్డి ల పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇక బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు సీట్లపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ పార్లమెంట్ స్థానాలు దక్కించుకొని. కేంద్రంలో కూడా తమ పాత్ర ఉండాలని అనుకుంటున్న వైసీపీ. నాలుగు ఎంపీ స్థానాలు మినహా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది.


లైవ్ టీవి


Share it
Top