దివ్యవాణికి అలీ స్ట్రాంగ్ కౌంటర్..!

దివ్యవాణికి అలీ స్ట్రాంగ్ కౌంటర్..!
x
Highlights

ఇటివలే ప్రము‌ఖ సినీ నటుడు అలీ వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే కాగా అలీ చేరికపై టీడీపీ నేత దివ్యవాణి అలీపై ఆరోపనలు కురిపించారు. అలీ వైసీపీలో చేరే...

ఇటివలే ప్రము‌ఖ సినీ నటుడు అలీ వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే కాగా అలీ చేరికపై టీడీపీ నేత దివ్యవాణి అలీపై ఆరోపనలు కురిపించారు. అలీ వైసీపీలో చేరే ముందు ప్యాకేజీ తీసుకుని తాను వైసీపీలో చేరినట్టు వ్యాఖ్యానించరు. కాగా దీనిపై అలీ స్పందిస్తూ టీడీపీ నేత దివ్యవాణికి కౌంటర్‌ వేశారు. ప్యాకేజీ తీసుకుని తాను వైసీపీలోకి వచ్చాను అన్న దివ్యవాణిపై అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్యాకేజీ తీసుకుని వైసీపీలో చేరినట్లు మీరు చూశారా? లేక సెల్ఫీ తీశారా అని అలీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరీ టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా అని అలీ ఎద్దేవా చేశారు. పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories