కుట్రలో భాగంగానే కడప ఎస్పీని మార్చారు: జగన్‌

కుట్రలో భాగంగానే కడప ఎస్పీని మార్చారు: జగన్‌
x
Highlights

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హత్య దగ్గర నుంచి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీ మాత్రం,...

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హత్య దగ్గర నుంచి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీ మాత్రం, సిట్‌పై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. శనివారం వైసీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిశారు. జగన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌కు వైసీపీ బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్టుందని అన్నారు. రాజకీయాల్లో గెలిచేందుకు నారా చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే కడప ఎస్పీని 40 రోజుల క్రితం మార్చారని జగన్‌ మండిపడ్డారు. తప్పు చేశారు కాబట్టే సీబీఐ విచారణకు చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. డీజీపీ, అడిషనల్‌ డీజీలను విధుల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories