Top
logo

కన్నీటి సంద్రమైన పులివెందుల

కన్నీటి సంద్రమైన పులివెందుల
X
Highlights

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో కడప జిల్లా పులివెందుల శోకసంద్రగా మారింది. వైఎస్...

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో కడప జిల్లా పులివెందుల శోకసంద్రగా మారింది. వైఎస్ వివేకా పార్థీవ దేహాన్ని ఉంచిన ఇంటి దగ్గరకు అభిమానులు, వైసీపీ శ‌్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నేత తరలిరాని లోకాలను వెళ్లాడనే వాస్తవాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైఎస్ వివేకా నివాసం ప్రాంగణంలోనే వేలాది మంది కార్యకర్తలు రాత్రంతా జాగారం చేశారు. ఏ కష్టమోచ్చిన కనీళ్లు తుడుస్తూ తమకు అండగా నిలుస్తూ వచ్చిన నాయకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అభిమానులు నినాదాలు చేశారు.

వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య కాసేపట్లో వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పార్ధీవ దేహం ఉంచిన వైఎస్ వివేకా నివాసం నుంచి ఇడుపులపాయ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. తండ్రి రాజారెడ్డి సమాధి పక్కన వివేకా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story