Top
logo

వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి

వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌లో నిర్వహించారు. అభిమాన నేతను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌లో నిర్వహించారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య వివేకా అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ..పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ శర్మిల, మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివేకానందరెడ్డిని చివరిసారిగా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంత్యక్రియలకు ముందు వివేకానందరెడ్డి ఇంటి దగ్గర ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Next Story