వైఎస్ వివేకా హ‌త్య కేసు..ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?

వైఎస్ వివేకా హ‌త్య కేసు..ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
x
Highlights

మాజీ మంత్రి వివేకానంద రెడ్డిది సాధారణ మృతేనని మొదట భావించినా అనంతరం, హత్యేనని తేల్చారు. వివేకానంద మృతి చెందినట్టు గుర్తించినప్పటి నుంచి హత్యేనని...

మాజీ మంత్రి వివేకానంద రెడ్డిది సాధారణ మృతేనని మొదట భావించినా అనంతరం, హత్యేనని తేల్చారు. వివేకానంద మృతి చెందినట్టు గుర్తించినప్పటి నుంచి హత్యేనని ప్రకటించే వరకు జరిగిన పలు సంఘటనలపై, ఆయన సన్నిహితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకానందని హత్య చేసినట్టు ఘటనా స్థలంలో ఆధారాలు లభించినా ఆయన గుండెపోటుతో మృతి చెందారని ఎవరు ప్రకటించారు..? అసలు ఎలా నిర్ధారించారు...? ఇలా పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో రక్తపు మడుగులో మృతి చెందిన ఉన్న వివేకానందరెడ్డిని ఆయన పీఏ కృష్ణారెడ్డి చూశాడు. ఆయన మృతి చెందినట్టు నిర్థారించుకున్న వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు అందరూ భావించారు. వివేకానందరెడ్డికి గతంలో గుండెపోటు రావడంతో అప్పట్లో సర్జరీ చేసి స్టంట్ వేశారు. దీంతో ఇప్పుడు కూడా గుండెపోటు వచ్చే ఆయన మృతిచెంది ఉంటారని అంతా అనుకున్నారు. పోలీసులు వచ్చి, దర్యాప్తు మొదలుపెట్టడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. వివేకానంద రక్తపు మడుగులో పడి ఉన్నాడని, ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయని గుర్తించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. వివేకానంద రూంలో వేలిముద్రలతో పాటు ఫుట్ ప్రింట్స్ ను కూడా కేసరించారు. ఇది సాధారణ మరణం కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివేకనంద శరీరంపై గాయాలు ఉన్నాయని ఉదయమే గుర్తించిన పోలీసులు మధ్యాహ్నం వరకు ఎందుకు బయటకి తెలియనివ్వలేదు..? హత్యేనని నిర్ధారించడానికి ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు.? కేసు తీవ్రత దృష్ట్యానే హత్య విషయాన్ని ఆలస్యంగా ప్రకటించారా..? లేక, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.?

రాత్రి పదకొండున్నర సమయంలో ఇంటికి వచ్చిన వివేకానంద రెడ్డి ఉదయం ఆరు గంటల సమయంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. అంటే, రాత్రి పదకొండున్నర నుంచి ఉదయం ఆరుగంటల మధ్యలోనే హత్య జరిగి ఉండాలి. సమాచారం అందిన వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యాహ్నం 3 గంటల తర్వాత, వివేకానంద రెడ్డిది హత్యేనని ప్రకటించారు. ఘటనా స్థలంలో పలు ఆధారాలు ఉన్నా.. హత్యేనని చెప్పడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు..? వివేకానంద రెడ్డి మాజీ మంత్రి మాత్రమే కాదు మాజీ సీఎం వైఎస్ సోదరుడు, రాయలసీమలో సీయర్ నేత. హత్యకు గురైంది కీలక వ్యక్తి కాబట్టే పోలీసులు, పూర్తిగా క్లారిటీ వచ్చాకే, హత్య అని ప్రకటించారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories