ఇదీ చంద్రబాబు తెలివి : వైఎస్‌ షర్మిల

ఇదీ చంద్రబాబు తెలివి : వైఎస్‌ షర్మిల
x
Highlights

వైసీపీ హామీలను కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారన్నారు షర్మిల. రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు....

వైసీపీ హామీలను కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారన్నారు షర్మిల. రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. అమరావతిని సింగాపూర్ చేస్తానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మకిలిపురంలో రోడ్ షో నిర్వహించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 600లకు పైగా హామీలు తుంగలో తొక్కి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అని ఓ పుస్తకాన్ని తయారు చేసి మరోసారి ఏపీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని షర్మిల విమర్శించారు. కనీసం పాత మేనిపెస్టోను పార్టీ వెబ్‌సైట్‌లో పెట్టే ధేర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ హామీలను కాఫీకొట్టి తమ మేనిఫోస్టోలో చేర్చుకోవడమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలని షర్మిల ఎద్దేవా చేశారు. గత 40 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో ఈ ఐదేళ్లలో అంత అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని నారా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ దోచుకుతిన్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories