Top
logo

సింహం సింగిల్‌గానే వ‌స్తుంది: షర్మిల

సింహం సింగిల్‌గానే వ‌స్తుంది: షర్మిల
Highlights

శుక్రవారం బస్సుయాత్ర ప్రారంభించిన షర్మిల శనివారం గుంటూరు సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వైసీసీ అధినేత వైఎస్...

శుక్రవారం బస్సుయాత్ర ప్రారంభించిన షర్మిల శనివారం గుంటూరు సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చంద్రబాబే టార్గెట్‌గా వ్యంగ్యాస్త్రాలు కురిపించింది. అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా..ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని నారా చంద్రబాబు నాయుడు ఇప్పడు మరొక్కసారి దగా చేయడానికి అవకాశం ఇవ్వామనడం విడ్డూరంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో బాబు రైతున్నలను మోసం చేశారని, ఇటు డ్వాక్రా మహిళలను కూడా రుణమాఫీ పేరుతో మోసం చేశారని విమర్మించారు. కాగా ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని షర్మిల మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ ఆ జాబు బాబు కుమారుడు లోకేష్‌కే వచ్చిదన్నారు. లోకేష్‌కు జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలీదు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా మూడు శాఖలకు మంత్రి అయ్యారు. బాబుది రోజుకో మాట.. పూటకో వేషం అని ఎద్దేవా చేశారు. బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందన్నారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదు..సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. బైబై చంద్రబాబు..ఇదే ప్రజా తీర్పు కావాల‌ని షర్మిల పిలుపునిచ్చారు.

Next Story